భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను తితిదే ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది. పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరింత సమాచారం www.tirumala.org, www.tirupatibalaji.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల - తిరుమల తాజా వార్తలు
ఆగస్టు 1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల కానున్నాయి. 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
శ్రీవారి పవిత్రోత్సవాలు