ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2020, 6:45 PM IST

ETV Bharat / city

శ్రీవారి లడ్డూలతో జిల్లాలకు తరలిన వాహనాలు

శ్రీవారి లడ్డూలతో 2 వాహనాలు వివిధ జిల్లాలకు తరిలాయి. ఈనెల 25 నుంచి జిల్లాల్లో ఉన్న తితిదే కల్యాణ మండపాల్లో భక్తులకు లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు.

tirumala srivari laddus avialable to devotees
శ్రీవారి లడ్డూలతో జిల్లాలకు తరలిన వాహనాలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తరలింపు కార్యక్రమాన్ని తితిదే ప్రారంభించింది. తిరుమలలోని లడ్డూల నిల్వ కేంద్రం నుంచి లక్షా 20వేల లడ్డూలతో 2 లారీలు బయలుదేరాయి. ఈ వాహనాలను అదనపు ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ నెల 25వ తారీఖు నుంచి లడ్డూ ప్రసాదాలను 13 జిల్లాలోని తితిదే కల్యాణ మండపాల్లో భక్తులకు అందజేయనున్నారు.

శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌పట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో భక్తులకు లడ్డూలను అందించనున్నారు. మిగిలిన జిల్లాలకు లడ్డూలను రేపు తరలిస్తారు. ఈ విషయంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భక్తుల కోరిక మేరకే లడ్డూలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో కలసి భౌతిక దూరం పాటిస్తూ లడ్డూలను విక్రయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details