నకిలీ తిరుమల దర్శన టికెట్లతో భక్తులు మోసపోయిన ఘటన మరోసారి వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు శ్రీవారి దర్శనం తిరుపతికి చేరుకున్నారు. ఎటువంటి దర్శన టికెట్లు లేకపోవడంతో దళారులను ఆశ్రయించారు. కల్యాణోత్సవం వర్చువల్ సేవా టిక్కెట్లపై వచ్చే ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లుగా భక్తులను నమ్మించారు. నకిలీ టికెట్లను అప్పజెప్పి వారి వద్ద నుంచి దళారి 4వేల 400 రూపాయలు వసూలు చేశారు. టికెట్లతో కొండపై చేరుకుని దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించారు. టికెట్లను తనిఖీ చేయగా.. అవి స్కాన్ అవలేదు. అనుమానం వచ్చి వాటిని పరిశీలించగా నకిలీవిగా తేలింది. మోసపోయిన భక్తుల వద్ద ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటి దొంగల ఆసరాతో నకిలీ టికెట్లపై భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
బార్ కోడ్‌తో నకిలీ టికెట్లు..
సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగిస్తూ నకిలీ టికెట్లు, లేఖలను సృష్టించడంలో దళారులు ఆరితేరారు. ఏది నకిలీనో ఏది నిజమైన టికెట్టో తెలుసుకోలేనంతగా మార్ఫింగ్ చేస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్లన్నీ బార్ కోడ్‌తో జారీ అవుతాయి. ఈ బార్ కోడ్ ఆధారంగా నకిలీ టిక్కెట్లను దరాళులు తయారు చేస్తున్నారు. పాత టికెట్ల వివరాలపై భక్తుల పేరు.. గుర్తింపు కార్డు నంబరు.. దర్శన తేదీలను మార్చి నకిలీ టికెట్లను సృష్టిస్తున్నారు. టికెట్టుపై ఉన్న ధరకన్నా రెంటింపుగా వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.
దళారుల దందా..