తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తితిదే ఇవాళ విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. రోజుకు తొమ్మిది వేల టికెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లను పొందాలని తితిదే అధికారులు సూచించారు.
జులై కోటా శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల - శ్రీవారి దర్శన టికెట్లు వార్తలు
జులై నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను తితిదే ఇవాళ విడుదల చేయనుంది. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం కౌంటర్ల ద్వారా మూడు వేల టికెట్లు ఇవ్వనున్నారు. దర్శనానికి ఒక రోజు ముందుగా టికెట్లు జారీచేయనున్నారు.
జులై కోటా శ్రీవారి దర్శన టికెట్లు రేపు విడుదల
సాధారణ భక్తుల కోసం ఉచిత టైంస్లాట్ టోకెన్లు తిరుపతిలో ఇవ్వనున్నాను. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్లు జారీచేయనున్నారు. రోజుకు మూడు వేల చొప్పున ఒక రోజు ముందు టోకెన్లు జారీ చేయనున్నారు. జులై 1వ తేదీన దర్శనం కోసం ఈ నెల 30న టోకెన్లు జారీచేస్తారు.
ఇదీ చదవండి :'విపత్కర సమయంలో రేషన్ ధరల పెంపు సరికాదు'
Last Updated : Jun 29, 2020, 1:13 AM IST