శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఇవాళ ఉదంయ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది కలసి ఆలయాన్ని పవిత్ర జలంతో శుభ్రపరిచారు. కరోనా వైరస్ కారణంగా శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించేందుకు, ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
19 నుంచి 29 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు - శ్రీవారి బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నెల 19 నుంచి 29వ తారీఖు వరకు శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
19 నుంచి 29 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది 23వ తారీఖున గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించనున్నట్లు ఈవో వెల్లడించారు.