తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి వాహనసేవను తితిదే వైభవంగా నిర్వహించింది. కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై అభయ ప్రదానం చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు.
అశ్వ వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు - srivari brahmotsavas last before day
శ్రీవారి ఆఖరి వాహన సేవ ఘనంగా జరిగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనుండగా.. నిన్న అశ్వ వాహనంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. కల్కి అలంకారంలో శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిచ్చారు.
శ్రీవారి అశ్వవాహన సేవ
వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ.. పండితులు స్వామి వారికి కర్పూర, పూర్ణకుంభ హారతులను సమర్పించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం నిర్వహించే చక్రస్నాన కార్యక్రమంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి:పెరిగిన భూగర్భ జలాల మట్టం... బోరుబావిలో పొంగుతున్న నీరు