కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో.. ముందు జాగ్రత్త చర్యగా తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. ఈ కారణంగా.. తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. శ్రీవారి భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. దాదాపు 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. ఈ లడ్డూలన్నీ తితిదే సిబ్బందికి ఉగాది కానుకగా ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రత్యేక వాహనాల్లో లడ్డూ ప్రసాదాన్ని తరలించి మరీ.. సిబ్బందికి ఉగాది కానుకగా శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేసింది.
కరోనా ఎఫెక్ట్: తితిదే సిబ్బందికి ఉచితంగా స్వామి వారి లడ్డూలు - tirumala laddu free news
కరోనా వ్యాప్తితో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. వాటిని ఉగాది కానుకగా సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు.

tirumala laddu
కరోనా ఎఫెక్ట్ : తిరుమల లడ్డూలు ఉచితం