ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే సిబ్బంది నిర్లక్ష్యం...సగమే వెలిగిన తిరునామం లైట్లు

తిరుమల శ్రీవారి గాలిగోపురానికి ఉండే తిరునామం లైట్లు ఆరిపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు తిరునామం సగమే కనిపించినా ...సిబ్బంది పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్లే భక్తులు...గాలిగోపురంపై ఉండే తిరునామాన్ని దర్శించుకుంటారు. శనివారం రాత్రి తిరునామం లైట్లు ఆరిపోయి...సగం నామం మాత్రమే కనిపించింది.

Tirumala galigopuram lights
Tirumala galigopuram lights

By

Published : Nov 1, 2020, 4:42 AM IST

తిరుమల శ్రీవారి గాలిగోపురానికి ఉండే తిరునామాలు దాదాపు గంటపాటు సగమే వెలగటం శ్రీవారి భక్తులను కలవరపెట్టింది. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్లాలన్నా, ఘాట్ రోడ్డుపై ప్రయాణించాలన్నా అలిపిరి గరుడ విగ్రహం వద్ద నుంచి కనిపించే గాలిగోపురం తిరునామం, శంఖుచక్రాలకు భక్తులు మొక్కుకుని వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది. గాలిగోపురానికి ఉండే ఈ గోవింద నామాలు, శంఖుచక్రం మొత్తం తిరుపతి నగరమంతా వెలుగులీనుతూ దర్శనమిస్తాయి.

సగమే వెలుగుతున్న తిరునామం

భక్తులే కాకుండా నగరవాసులంతా సంధ్యవేళలో గోవిందనామాలను దర్శించుకుంటారు. గోవిందనామాల కోసం ఏర్పాటు చేసిన లైట్లు గంట పాటు సగమే వెలుగుతున్నా తితిదే సిబ్బంది పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీసింది. సాయంకాలం నమస్కరించుకుందామని చూసిన భక్తులు...నామం సగమే కనిపిస్తుండటంతో తితిదే సిబ్బంది అజాగ్రత్తను తప్పుబట్టారు.

ఇదీ చదవండి :'త్యాగధనుల స్ఫూర్తితో...అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్దాం'

ABOUT THE AUTHOR

...view details