ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గరుడ గమనుడై అరుదెంచె... గోవిందుడు..!

తిరుమల కొండ... కన్నుల పండుగ అయింది.. కొండల రాయడు శ్రీనివాసుడు.. గరుడ వాహననంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.   బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఇవాళ రాత్రి స్వామి గరుడసేవ భక్తజన నేత్రపర్వంగా సాగింది.

గరుడ గమనుడై అరుదెంచె... గోవిందుడు..!

By

Published : Oct 4, 2019, 10:31 PM IST

Updated : Oct 7, 2019, 12:54 PM IST

గరుడ గమనుడై అరుదెంచె... గోవిందుడు..!
కొనేటి రాయడు.. శ్రీనివాసుడు.. గరుడ వాహనారూఢుడై... భక్తులకు దర్శనమిచ్చారు. సువర్ణ, రత్న, మణి, మయభూషణాలతో.. సర్వాలంకారశోభితుడై...గరడవాహనంపై అరుదెంచారు. తిరువీధుల్లో స్వామివారి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది.

గరుడసేవ అత్యంత ప్రధానం
తొమ్మిది రోజుల పాటు సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు రాత్రి నిర్వహించే గరుడసేవ అత్యంత ప్రధానమైనది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. స్వామి సేవలో పాల్గొనడం కోసం.. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తలు కొండకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే తిరువీధులన్నీ భక్తజనంతో నిండిపోయాయి. గరడుసేవను ప్రశాంతంగా నిర్వహించేందుకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదులక్షల మంది భక్తులు ఈ గరడసేవలో పాల్గొన్నారని అంచనా..!

Last Updated : Oct 7, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details