తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా.. తొమ్మిదోరోజు రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం.
ఈ ఉత్సవంలో భాగంగా.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం మీద నుంచి కిందకు దించారు. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా గరుడాళ్వార్ దేవతలను కోరాడు.