ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారికి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు - తిరుమల బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సాయంత్రం మలయప్పస్వామి దేవేరులతో కలసి సర్వభూపాలవాహనం అధిరోహించారు. రాత్రి నిర్వహించిన గజవాహన సేవలో సర్వాలంకార భూషితుడై భక్తులకు అభయమిచ్చారు. ఈ రోజు ఉదయం సుర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించనున్నారు.

ఇవాళ శ్రీవారికి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
ఇవాళ శ్రీవారికి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు

By

Published : Sep 25, 2020, 5:12 AM IST

Updated : Sep 26, 2020, 4:25 AM IST

కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాలలో ఆరో రోజున ఉదయం స్వామివారు సన్నిధి నుంచి తిరుచ్చిపై విమాన ప్రదక్షిణంగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. విశేష తిరువాభరణాలతో, పరిమళభరిత పూల మాలలతో సర్వాంగసుందరంగా అలంకృతులై హనుమంత వాహనాన్ని అధిరోహించారు. హనుమంతుడిపై వేంక‌టాద్రిరాముని అవతారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బంగారు రథోత్సవం నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే... బంగారు రథం స్థానంలో సర్వభూపాల వాహన సేవను నిర్వహించింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీదేవీ, భూదేవీ సమేతంగా సర్వభూపాల వాహన సేవలో దర్శన మిచ్చిన స్వామి, అమ్మ వార్లకు ఆలయ అర్చకులు కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గజవాహన సేవను వైభవంగా నిర్వహించారు. మలయప్పస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు సుర్యప్రభవాహన సేవను... రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు. పాత వెండి సూర్యప్రభ వాహనంపై....సేవను నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. స్వామివారికి వాహన సేవలన్నీ బంగారు పూతతో తయారు చేసినవే ఉండగా.... సూర్యప్రభ వాహనం పెద్దదిగా ఉంది. మహద్వారం నుంచి ఉత్సవాలు నిర్వహించే కల్యాణ మండపానికి తీసుకెళ్లేందుకు వీలుకాకపోవడంతో... పాత వెండి వాహనంపై సేవను నిర్వహిస్తారు.

.

ఇదీ చదవండి:హెల్త్ బులెటిన్: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం

Last Updated : Sep 26, 2020, 4:25 AM IST

ABOUT THE AUTHOR

...view details