తిరుమల(thirumala)లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు(brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ అర్చకులు హంస వాహన సేవ(hamsa vahana seva) నిర్వహించారు. హంస వాహనంపై ఊరేగుతూ స్వామివారు దర్శనమిచ్చారు. తిరుమల ఆలయంలోని కల్యాణ మండపంలో(kalyana mandapam) ఈ వాహన సేవను నిర్వహించారు.
బ్రహ్మదేవుడు ఆశ్వయుజ మాసంలో శ్రీనివాసుని జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు(brahmotsavalu) నిర్వహించినట్లు పురాణాలు(mythology) చెబుతున్నాయి. నాటి నుంచి స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. పదో శతాబ్దం నాటి తమిళ శాసనం(thamil shasana)లో దీని ప్రస్తావన ఉంది.
శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు...
బ్రహ్మదేవుడు ఆశ్వయుజ మాసంలో శ్రీనివాసుని జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాటి నుంచి స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. పదో శతాబ్దం నాటి తమిళ శాసనంలో దీని ప్రస్తావన ఉంది. శ్రీవారి కౌతుకమూర్తిగా వివిధ సేవలు జరిపించుకునే భోగ శ్రీనివాసమూర్తి (bhoga srinivasa moorthy)వెండి విగ్రహాన్ని పల్లవ రాజ్యాధికారి ధర్మపత్ని స్వామికి కానుకగా ఇచ్చింది. అర్చకులు భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కౌతుకమూర్తిగా, ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవమూర్తిగా వినియోగించారు. 1339 నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి(malayappa swamy) బ్రహ్మోత్సవాలతోపాటు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.