కరోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను మే 31 వరకు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా మే 3వ తేదీ వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన తితిదే.. ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్, పోస్టాఫీసు ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు వాటిని రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భక్తులు.. వారి టిక్కెట్ల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ను helpdesk@tirumala.orgకు పంపాలని కోరింది. వివరాలను పరిశీలించి రీఫండ్ నగదు వారి ఖాతాల్లో జమ చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.
మే 31 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లేదని తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మే 3 వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది.
తిరుమల