ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుచానూరులో ఈ నెల 17 నుంచి 26 వరకు నవరాత్రోత్సవాలు - తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వార్తలు

ఈ నెల 17వ తేదీ నుంచి 26 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. కరోనా కారణంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

ఈ నెల 17 నుంచి 26 వరకు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
ఈ నెల 17 నుంచి 26 వరకు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

By

Published : Oct 10, 2020, 1:54 AM IST

Updated : Oct 10, 2020, 12:29 PM IST

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి నవరాత్రోత్సవాలు అక్టోబ‌రు 17 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా కారణంగా ఉత్సవాల‌ను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలో ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు.

అక్టోబరు 26న గజవాహనసేవ జరగనుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పది రోజుల పాటు క‌ల్యాణోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లతో పాటు అక్టోబరు 23న నిర్వహించే లక్ష్మీపూజను రద్దు చేశారు.

ఇదీ చదవండి :గుంతలమయంగా రోడ్డు.. ఆరటి తోటలోకి దూసుకెళ్లిన బస్సు

Last Updated : Oct 10, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details