హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి... గుడులకు శంకుస్థాపనలు, గోపూజలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని... అయితే ఇటీవల కొన్నివర్గాల తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. లోక్సభ ఉపఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో తిరుపతి లోక్సభ పరిధి తెదేపా నేతలు పాల్గొన్నారు.
తిరుపతిని సీఎం జగన్.. వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. అన్యమత ప్రచారానికి తిరుపతిని అడ్డాగా మార్చారు. ఆలయాలపై మేం దాడి చేసినట్లు నిరూపిస్తే క్షమాపణ చెబుతాం.