ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటీపడ్డ భక్తులు...స్తంభించిన సర్వర్‌ - చిత్తూరు తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తితిదే చేసిన ప్రకటనకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. మంగళవారం ఉదయం టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన వెంటనే భక్తులు బుక్‌ చేసుకునేందుకు పోటీపడ్డారు.

Thirumala srivari Vaikuntha dwara darshanam Online ticket booking
తిరుమల వైకుంఠ ద్వార దర్శన ఆన్​లైన్​ టికెట్ బుకింగ్

By

Published : Dec 2, 2020, 7:19 AM IST

వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తితిదే చేసిన ప్రకటనకు భక్తుల నుంచి స్పందన వస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి రోజు 20వేల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని తితిదే అధికారులు నిర్ణయించారు. అంటే పది రోజుల వ్యవధిలో 2 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన వెంటనే భక్తులు బుక్‌ చేసుకునేందుకు పోటీపడ్డారు. ఒక్కసారిగా 5 లక్షలకు పైగా హిట్లు పడటంతో తితిదే సర్వర్‌ స్తంభించింది. సమస్యను అధిగమించేందుకు ఏపీ డేటా సర్వర్‌ను వినియోగించేందుకు తితిదే అధికారులు సిద్ధమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details