ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతి గ్రామీణ పరిధిలోని..విద్యానగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి నలుగురు చొరబడి..చోరీకి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్‌లోకి వారు ప్రవేశించిన తీరు, కదలికల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా చెడ్డీ గ్యాంగ్ తాళాలు వేసిన ఇళ్లను కొల్లగొడుతుంటుంది. విద్యానగర్ అపార్ట్‌మెంట్‌లోనూ యజమాని పొరుగూరు వెళ్లిన సమయంలోనే చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని విజయలక్ష్మి భర్త కొవిడ్‌తో మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా అరగొండ సమీపంలోని సొంతూరులో ఉంటోంది. స్థానికంగా విలువైన వస్తువులు ఉంచకపోవడంతో భారీ చోరీ ముప్పు తప్పింది. నాలుగు గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు ముత్యాలరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో పగలు,రాత్రి అనే తేడాలేకుండా దొంగతనాలు పెరిగిపోయాయి. ఈ సమయంలోనే చెడ్డీ గ్యాంగ్ కదలికలు మరింత భయపెడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చెడ్డీ గ్యాంగ్.. తిరుపతి శివార్లలో మకాం వేసి. బిచ్చగాళ్లలా, బొమ్మలు, దుప్పట్లు విక్రేతలలా నగరంలో తిరుగుతున్నారని,. తాళాలు వేసిన ఇళ్లపై పగలు రెక్కీ చేసి రాత్రిళ్లు పనికానిచ్చేస్తున్నారని అనుమానిస్తున్నారు. బనియన్, చెడ్డీ వేసుకుని శరీరానికి నూనె పూసుకొని దోపిడీకి ప్రయత్నిస్తారు.చెడ్డీగ్యాంగ్‌లో పాతనేరస్థులెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. విద్యానగర్ కాలనీలో చోరీ జరిగిన ఇంట్లో వేలిముద్రలుసేకరించి వాళ్ల చోరీ చరిత్ర తవ్వుతున్నారు.
శివారు భవంతులే లక్ష్యంగా..