ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైంది: తెదేపా - TDP Attack on Jagan News

ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైందని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు.

చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైంది: తెదేపా
చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైంది: తెదేపా

By

Published : Mar 23, 2021, 4:52 PM IST

చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైంది: తెదేపా

నిజాయతీగా ఎన్నికలు జరిగితే ప్రజలు తనకు ఓట్లు వేయరన్న భయంతోనే ముఖ్యమంత్రి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉందని వాఖ్యానించారు. చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కనుమరుగైందని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ప్రజలపై నమ్మకం లేకనే దౌర్జన్యాలకు పాల్పడే మంత్రులను ఉపఎన్నికల బాధ్యులుగా నియమించి గెలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. 22 మంది ఎంపీలున్నా ఏరోజు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్​లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details