ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్వారంటైన్‌కు వెళ్లి వచ్చారని..ఇంట్లోకి రానివ్వలేదు

కరోనా వైరస్ మనుషుల మధ్య దూరం పెంచటంతో పాటు మానవత్వాన్ని మాయం చేస్తోంది. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందేమోనన్న భయంతో చాలా మంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా అనుమానంతో క్వారంటైన్​కు వెళ్లి వచ్చిన కుటుంబాన్ని ఇంట్లోకి రానివ్వలేదు ఓ యజమాని. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.

the owner did not allow the family to house for they returned from quarantine
the owner did not allow the family to house for they returned from quarantine

By

Published : Jul 22, 2020, 3:14 PM IST

బాధిత కుటుంబం ఆవేదన

అద్దె ఇళ్లలో నివాసముంటున్న వారు కరోనా నుంచి కోలుకున్నా కష్టాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఇంట్లో ఒకరికి కరోనా నిర్ధరణ కావడం.. మిగతా కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ అయి తిరిగి ఇంటికి వస్తే లోపలికి రానీయకుండా యజమాని ఇబ్బందులు పెడుతున్నారు.

తాజాగా తిరుపతిలోని సుందరయ్య నగర్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా... అతని కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్​కు తరలించారు. వీరికి నెగెటివ్ రావటంతో అక్కడ కొన్ని రోజులున్న తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ అద్దె ఇంట్లో ఉంటున్న వీరిని ఇంటి యజమాని లోపలికి అనుమతించలేదు. పోలీసులు, వార్డు వాలంటీర్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయాడు. అతని ప్రవర్తనతో ఓ మహిళ, తన ఇద్దరు కుమార్తెలతో ఇంటి బయటే పడిగాపులు కాస్తోంది. తమను ఇంటి లోపలికి వెళ్లనివ్వాలని వేడుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details