ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేవాలయ నిర్వహణ పూర్తిగా హిందువులకు అప్పగించాలి'

దేవాలయాల నిర్వహణ పూర్తిగా హిందువులకు, హిందూ సంస్థలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది. దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్థులను వెంటనే పంపించేయాలని కోరింది. దేవాలయ భూముల విక్రయానికి వ్యతిరేకంగా శనివారం హిందువులంతా ఉపవాస దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చింది.

vhp
vhp

By

Published : May 28, 2020, 8:12 PM IST

శ్రీవారి భూముల విక్రయాన్ని తితిదే నిలుపుదల చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతించింది. తితిదే భూములు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అన్ని దేవాలయాల భూములను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పింది. అంతే తప్ప విక్రయానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదన్నది గుర్తించాలని తెలిపింది. హిందూ దేవాలయాల్లో అన్య మత ఉద్యోగులను వెంటనే పంపించేయాలని కోరింది. అలాగే స్వామివారి లడ్డూ విక్రయాలను తితిదే వెంటనే నిలిపివేయాలి... లేదంటే ప్రసాదంగా కాకుండా ఒక మిఠాయిగా భావించి వినియోగించే పరిస్థితి తలెత్తుతోందని అభిప్రాయపడింది. ముల్లాలు, పాస్టర్లకు ప్రజా ధనం నుంచి జీతాల రూపంలో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని... వెంటనే దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. దేవాలయ నిర్వహణ పూర్తిగా హిందువులకు, ఆ సంస్థలకు అప్పగించాలని కోరింది.

దేవాలయ భూముల విక్రయానికి వ్యతిరేకంగా వచ్చే శనివారం హిందువులంతా ఉపవాస దీక్ష చేపట్టాలని పిలుపు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఎవరి ఇంటివద్ద వారు ఫ్లకార్డులతో నిరసన చేయాలని కోరింది. సాయంత్రం ఏడు గంటలకు స్వామి వారి ఏడుకొండల ప్రతీకగా ఏడు దీపాలు వెలిగించాలని వీహెచ్​పీ ప్రాంత ఉప కార్యదర్శి సుబ్రమణ్యం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details