రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని... ప్రభుత్వమే బాధ్యత వహించాలని విశ్రాంత న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు ఒక్క చోట కూర్చొని తమ సమస్యలను చర్చించుకునే స్వేచ్ఛను కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని ధ్వజమెత్తారు.
తిరుపతి గ్రాండ్ వరల్డ్ హోటల్ వద్ద ఉద్రిక్తత - tirupathi latest updates
12:36 September 25
ముస్లింలపై దాడులను ఖండిస్తూ ఐకాస నేతల బస్సు యాత్ర
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థపై ఆయన నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నందుకు సిగ్గుపడాలి అన్నారు. కడపలో ఒక ముస్లిం మైనార్టీ కుటుంబం రాజకీయ ఒత్తిళ్ళు, పోలీసుల వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటే నిందితులకు ఒక్కరోజులోనే బెయిలు రావడం జగన్ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. తన 17 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సంఘటన ఎప్పుడు వినలేదన్నారు. మదనపల్లి నుంచి విశాఖకు ముస్లిం మైనారిటీలు చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకోవడం చట్ట విరుద్ధమన్నారు.
డీజీపీ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ స్థాయి అధికారి వరకు అనుమతి తీసుకున్నా స్థానికంగా ఉన్న పోలీసులు ఎందుకు నిర్భందం పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఇబ్బందులు, కేసులు పెట్టినా కార్యక్రమాన్ని జరిపి తీరుతామని తెలిపారు. రాష్ట్రంలో సంవత్సరానికి లక్షా 27 వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే ఇందులో కేవలం మూడు వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని.. మిగిలిన వారంతా బయటి రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:TTD: ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ... బారులు తీరిన భక్తులు