Big Donations to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు భారీ విరాళాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు శ్రీవారికి రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. స్వామివారికి ఇలా ఒక్క రోజే భారీ స్థాయిలో విరాళం అందించడం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Tirumala: తితిదే చరిత్రలోనే తొలిసారి.. శ్రీవారికి రూ. 10 కోట్ల విరాళం - tamil devotees donate 1o crores to ttd
Rs.10 Crores Donated To TTD: తిరుమల తిరుపతి దేవస్ధానం(తితిదే) చరిత్రలోనే అధిక మొత్తంలో భక్తులు ఒకేరోజు భారీ విరాళాన్ని అందించారు. తమిళనాడు చెందిన పలువురు భక్తులు శ్రీవారికి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కులను తితిదే ఈవో ధర్మారెడ్డికి దాతలు అందజేశారు.

Big Donations to TTD
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన భక్తుడు గోపాల బాలకృష్ణన్.. తితిదే నిర్వహణలో ఉన్న అన్నదానం సహా 7 ట్రస్టులకు రూ.7 కోట్లు విరాళంగా అందించారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. కోటి, బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు సీహబ్ ఇన్‌స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని తితిదే ఈవో ధర్మారెడ్డికి విరాళానికి సంబంధించిన చెక్కులు అందజేశారు.
ఇదీ చదవండి: