ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్​బ్యాంకు ఎన్నికలపై.. హైకోర్టు సీజేకు ఫిర్యాదు - తిరుపతి జిల్లా తాజా వార్తలు

తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు సీజేకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అన్యాయంగా తమను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేను కోరారు.

Tirupati Cooperative
ఫిర్యాదు

By

Published : Jul 20, 2022, 4:10 PM IST

తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు సీజేకి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అనధికారిక నిర్బంధం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఫిర్యాదుదారులు అన్నారు. పోటీలో ఉన్న వ్యక్తులు కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. నిర్బంధించడానికి గల కారణాలు చెప్పలేదని, నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. నిర్బంధాన్ని ప్రశ్నిస్తే పోలీసుల నుంచి సరైన సమాధానం రావడంలేదని మండిపడ్డారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని... పౌర హక్కులు రక్షించాలని కోరారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details