రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మేధావులు ప్రజలను చైతన్యపరచాలని ఆయన వేడుకున్నారు. తిరుపతి ఉపఎన్నికలో 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు సృష్టించారని కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉరికొయ్యపై ఉందని తెదేపా సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఆదాయం పెరిగినా రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెదేపా సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు