తిరుమల శ్రీవారిని విజయవాడ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కరోనాతో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... ఆదాయం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు 8వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని - TTD news
ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీ కేశినేని నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Nani worships at Tirumala