మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే తలవంపులని... ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. నిబంధనలకు లోబడి తమ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా శాసనమండలిలో తెదేపా సభ్యులు వ్యవహరించారని చెప్పారు. వైకాపా ప్రలోభాలకు తాము లోంగబోమని స్పష్టం చేశారు. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' ఉండాలన్నది తమ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. గత 37 రోజులుగా రాజధాని కోసం రైతులు నిరసనలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.
'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' తెదేపా సిద్ధాంతం..! - tdp mlc srinivasulu about capital bill
అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంలో భాగస్వాములైనందుకు... ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును తిరుపతిలో తెదేపా కార్యకర్తలు సన్మానించారు.

మా పార్టీ సిద్ధాంతం 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని'
'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' తెదేపా సిద్ధాంతం..!
TAGGED:
tdp mlc talks about capital