సీఎం జగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కలిసి ఆడుతున్న దొంగనాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. జైలుకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి.. భాజపా రక్షణతో పరిపాలన సాగిస్తున్నారని అందరికీ తెలుసని వీడియో సందేశంలో పేర్కొన్నారు. నీలం సాహ్ని.. సీఎం జగన్ బంట్రోతులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొంగ, పోలీసు ఒక్కటి కావడంతో ఎన్నికలకు వెళ్లకూడదని నిర్ణయించామన్నారు. వైకాపా శ్రీరంగ నీతులు చెప్పడం ఆపి.. దమ్ముంటే ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని సవాల్ విసిరారు.
"తెదేపాను కించపరిస్తే సహించేది లేదు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వాళ్లు పోటీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత ? ఆ పార్టీ కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటే. నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ నేతలు ప్రగల్భాలు పలకడం తగదు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలను కళ్లుండి చూడలేకపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున.. రాష్ట్రంలో పరిస్థితులపై పోరాడకుండా, తెదేపా మీద ఆరోపణలు చేస్తున్నారు" అంటూ సోము వీర్రాజుపై జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా ఓట్లు చీల్చేందుకే...