ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెద్దిరెడ్డి పుంగనూరు పరువు తీస్తున్నారు: శ్రీనాథ్ రెడ్డి

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మంత్రి పెద్దిరెడ్డి జనాన్ని తరలించడం వల్ల నియోజకవర్గం పరువు పోయిందని తెదేపా నేత శ్రీనాథ్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పనులు మానుకోవాలని హితవుపలికారు.

శ్రీనాథ్ రెడ్డి
పెద్దిరెడ్డి పుంగనూరు పరువు తీస్తున్నారన్న తెదేపా నేత

By

Published : Apr 18, 2021, 7:24 PM IST

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికలో రిగ్గింగ్ కోసం పుంగనూరు నియోజకవర్గం నుంచి మహిళలను బస్సుల్లో తరలించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరి పరువు తీశారని తెదేపా సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి ఆక్షేపించారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న పనులకు నియోజకవర్గం పేరు, పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వైఖరితో వైకాపా, సీఎం జగన్ కీర్తి పాతాళానికి పడిపోతోందన్న శ్రీనాథ్ రెడ్డి.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మహిళలను బస్సుల్లో తీసుకొచ్చిన మంత్రి పెద్దిరెడ్డిపై జగన్ పునరాలోచించుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details