తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం జరిగి 24 గంటలు దాటుతున్నా.. ఇప్పటికీ మృతుల వివరాలను అధికారులు ఎందుకు బయట పెట్టడం లేదని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ నిలదీశారు. మరణించిన 11 మంది పేర్లు చెప్పలేరా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత సీఎం స్పందించడాన్ని ఆయన చిత్తశుద్ధికే వదిలేస్తున్నామన్నారు. పదకొండు మంది మృతి చెందారని ముఖ్యమంత్రి తడబడుతూ చెప్పారని విమర్శించారు.
'రుయా ఆస్పత్రి ఘటనలో.. మృతుల పేర్లు ఇంకా ఎందుకు వెల్లడించలేదు?' - రుయా ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెదేపా నేత నరసింహ యాదవ్
తెదేపా నిజనిర్ధరణ కమిటీని తిరుపతి రుయా ఆస్పత్రిలోనికి అనుమతించక పోవడాన్ని.. ఆ పార్టీ నేత నరసింహ యాదవ్ తప్పుబట్టారు. ఘటన జరిగి రోజు గడుస్తున్నా.. మృతుల పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచాలన్నారు.
తెదేపా నేత నరసింహ యాదవ్
తెదేపా నిజనిర్ధరణ కమిటీని ఆస్పత్రిలోనికి ఎందుకు రానివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల వివరాలను, ఘటనకు గల కారణాలను.. పూర్తిస్థాయి నివేదిక రూపంలో మీడియాకు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి 50 లక్షలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: