ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఎన్నికలు సజావుగా జరగలేదు: తెదేపా నేత - తిరుపతి వార్తలు

తిరుపతి ఉపఎన్నికలు సజావుగా జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించడం పై తెదేపా నేత నరసింహ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలందరూ వాస్తవాలు గమనించారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

తెదేపా నేత నరసింహ యాదవ్
తిరుపతి ఎన్నికలు సజావుగా జరగలేదు

By

Published : Apr 18, 2021, 3:43 PM IST

తిరుపతి ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించడంపై తెదేపా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతిలో స్పందించారు. నిన్న జరిగిన పోలింగ్​లో చెవులకు వినిపించేటట్లు.. అందరి కళ్లకు కనిపించే విధంగా అక్రమాలు జరిగినా.. అంతా సజావుగా జరిగిందనడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఎస్పీ కార్యాలయం ఎదుటే దొంగ ఓట్లు వేసేందుకు జనాన్ని తరలిస్తున్న బస్సును 30 నిమిషాల పాటు నిలిపినా పోలీసులు స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. రిగ్గింగ్​కు పాల్పడిన వారిని, నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details