తిరుపతిలో భాజపా పోరు సొంత పార్టీ అభ్యర్థి కోసమా? లేక ఆత్మ స్నేహితులు వైకాపా కోసమా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి... సోము వీర్రాజును నిలదీశారు. ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డబ్బు, వందల కొద్దీ పెయిడ్ బ్యాచ్‌లతో భాజపా ప్రత్యేక ప్యాకేజీ ఏ హోదాలో భాగమని ప్రశ్నించారు. ఇంతకీ ఏపీ కమల నాధులు ప్రత్యేక హోదా కావాలి అంటున్నారా, లేక నోటా దెబ్బకి 'సొమ్మ' సిలిపోతారా అంటూ ఎద్దేవా చేశారు.
తిరుపతిలో భాజపా పోరు వైకాపా గెెలుపుకోసమే: గోరంట్ల - election news
తిరుపతి ఉపఎన్నికలో వైకాపాను గెలిపించేెందుకే భాజపా కృషి చేస్తోందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు.

తిరుపతిలో భాజపా పోరు వైకాపా గెెలుపుకోసమే: గోరంట్ల