తిరుపతి ఉపఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని.. ఈసీకి తెదేపా ఫిర్యాదు చేసింది. వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంతోపాటు కొందరు పోలీసు అధికారుల పక్షపాత ధోరణి, రమణ దీక్షితుల నియామకాలపై ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, మద్దిపాటి వెంకటరాజులు విడివిడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.
తిరుపతి ఉపపోరు: ఈసీకి తెదేపా లేఖ.. వైకాపాపై ఫిర్యాదు చేసిన అంశాలివే..! - తిరుపతి ఉపఎన్నికలపై ఈసీకీ టీడీపీ ఫిర్యాదు న్యూస్
తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తెదేపా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించి.. వైకాపాకు మద్దతుగా పని చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.
'సత్యవేడు అసెంబ్లీ పరిధిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించి వైకాపాకు మద్దతుగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్, బూత్ లెవల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాలి. 236 సున్నితమైన పోలింగ్ బూత్‌లలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి. రమణ దీక్షితుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. అసత్య ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎన్నికల్లో లాభం కలుగుతుందనే పదవి కట్టబెట్టారు' అని లేఖల్లో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రతులను మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, గన్ని కృష్ణ, సయ్యద్ రఫీలు సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌కు అందజేశారు.
ఇదీ చదవండి:సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు