తిరుపతి సాక్షిగా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి.. తర్వాత మాట నిలబెట్టుకోలేకపోయారని తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. విభజన హమీలను సాధించడంలో వైకాపా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ధ్వజమెత్తారు. విభజన హామీలు సాధించుకోవాలంటే ఉపఎన్నికల్లో తెదేపాకు ఓటు వేయాలని కోరారు.
తిరుపతిలోని లక్ష్మిపురంలో.. ఆమె ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై తెదేపా పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. గెలుపు తమదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.