ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రోజుకు 45 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం' - తిరుమల తాజా వార్తలు

రేపటి నుంచి రోజుకు 45 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తితిదే ఏఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు తిరుమలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

tdd decreases darshan tickets due to covid pendamic
తితిదే ఏఈవో ధర్మారెడ్డి

By

Published : Mar 30, 2021, 6:57 PM IST

Updated : Mar 30, 2021, 7:25 PM IST

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తితిదే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపటి నుంచి రోజుకు 45 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తితిదే ఏఈవో ధర్మారెడ్డి చెప్పారు. టైంస్లాట్ టోకెన్లు 15వేలకు పరిమితం చేస్తామని వెల్లడించారు. భక్తులు దర్శన టికెట్లు ఉన్న సమయానికి తిరుమలకు రావాలని పేర్కొన్నారు. నిత్యం ఇచ్చే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు తగ్గించామని ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల వెళ్లే బస్సులు, క్యూలైన్లను శానిటైజ్ చేస్తామన్నారు.

తిరుమల వచ్చే ప్రతి భక్తుడు మాస్కు ధరించడం తప్పనిసరి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తాం. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు తిరుమలకు రావొద్దని కోరుతున్నాం- ధర్మారెడ్డి, తితిదే ఏఈవో

తితిదే ఏఈవో ధర్మారెడ్డి
Last Updated : Mar 30, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details