శ్రీనివాసుని ఆడపడుచు, అమ్మలగన్న అమ్మగా... భక్తుల నీరాజనాలందుకుంటున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. చిత్తూరు జిల్లా నుంచే కాక సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న వేలాది భక్తులతో గంగమ్మ ఆలయం కిటకిటలాడుతోంది. ఐదో రోజు జాతరలో భాగంగా భక్తులు మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. పాలెగాళ్ల ఆటకట్టించేందుకు అమ్మవారు రోజుకో వేషం ధరించిందని స్థలపురణాలు చెబుతున్నాయి. అమ్మవారి వేషాలనే భక్తులు సైతం ధరిస్తూ... గంగమ్మకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కష్టాలు తమ దరిచేరకుండా చూడాలని వేడుకుంటున్నారు.
ఐదోరోజుకు... తాతయ్యగుంట గంగమ్మ జాతర
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఐదోరోజు భక్తులు మాతంగి వేషధారణతో మెుక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర