TNRTC Bus collided AP Lorry : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న రాష్ట్రానికి చెందిన లారీమ్ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తో సహా 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. మేర్లపాక సమీపంలో రేణుగుంట నాయుడుపేట ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు, అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TNRTC Bus collided AP Lorry :లారీని ఢీకొట్టిన తమిళనాడు ఆర్టీసీ బస్సు...డ్రైవర్ కు తీవ్ర గాయాలు.. - రేణుగుంట నాయుడి పేట ప్రధాన రహదారి
TNRTC Bus collided AP Lorry : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న రాష్ట్రానికి చెందిన లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
లారీని ఢీకొట్టిన తమిళనాడు ఆర్టీసీ బస్సు