శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ధనుష్ - తిరుమల వార్తలు
తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటుడు ధనుష్, తెలంగాణ విప్ జి.సునీత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
tamil actor dhanush visited tirumala temple