తిరుపతిలో స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. తమ పేమెంట్స్ యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆర్డర్ పేమెంట్స్ తగ్గించారని ఆరోపించారు. ఇది వరకు రోజుకు 320 ఆర్డర్లు ఎర్నింగ్ చేస్తే రూ.180 ఇన్సెంటివ్ వచ్చేదని.. కానీ ప్రస్తుతం రూ.120 కి తగ్గించి వేశారని వాపోయారు. పైగా తిరుపతిలో లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ మూసివేశారని వచ్చే ఇన్సెంటివ్ పెట్రోల్ ఖర్చు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన విధంగానే ఇన్సెంటివ్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ ధర్నా - zomato delivery boys
స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ కి ఆర్డర్ పేమెంట్స్ యధావిధిగా అమలు చేయాలని డెలివరీ బాయ్స్ తిరుపతి లో ధర్నాకు దిగారు.
స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ ధర్నా