తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహానికి చెందిన ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వసతిగృహ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఉద్యోగి రామచంద్రయ్య తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగి ఆత్మహత్యకు వసతి గృహ అధికారుల వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇందుకు కారణమైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్వీయూలో ఉద్యోగి ఆత్మహత్య..ఉన్నతాధికారుల వేధింపులే కారణమా! - ఎస్వీయూ విద్యార్థుల ఆందోళన
ఎస్వీయూ కళాశాలలో ఓ ఉద్యోగి మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వవిద్యాలయంలో కొందరి వేధింపులే అతని మృతికి కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
విద్యార్థుల ఆందోళన