తిరుపతి ఎస్వీ విశ్వ విద్యాలయంలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎస్వీయూ సెట్ -2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఇన్ఛార్జి ఉపకులపతి సతీష్ చంద్ర అమరావతి నుంచి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10,760 మంది విద్యార్థుల అర్హత పరీక్షలు రాశారు. వీరిలో 7,524 మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ కోర్సుల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ర్యాంకు కార్డులు త్వరలోనే జారీ చేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
ఎస్వీయూ సెట్- 2020 ఫలితాలు విడుదల - ఎస్వీయూ సెట్- 2020 ఫలితాలు
తిరుపతి ఎస్వీ విశ్వ విద్యాలయంలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎస్వీయూ సెట్- 2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మొత్తం 7,524 మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
SVU_PGCET