ఓ భక్తుడికి అశ్లీల లింకులు పంపిన కేసులో ఉద్యోగి పై ఎస్వీబీసీ చర్యలు తీసుకుంది. ఎస్వీబీసీ మేనేజర్ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ ఎస్వీబీసీ ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది నవంబర్లో ఓ కార్యక్రమానికి సంబంధించిన సమాచారంతో పాటు భక్తుడికి అశ్లీల లింకు పంపటం కలకలం రేపింది. భక్తుడి ఫిర్యాదుతో వ్యవహారంపై దర్యాప్తు చేసిన తితిదే.. విజిలెన్స్ విచారణ కమిటీ నివేదిక మేరకు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంది.