తిరుపతి స్విమ్స్‌లో ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి చెందింది. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ.. గుండె సంబంధిత సమస్యతో విజయమ్మ మరణించింది. రెండ్రోజుల క్రితం జూ పార్కులో విజయమ్మ పాముకాటుకు గురైంది. రెండు రోజులుగా స్విమ్స్ ఆస్పత్రిలో పాముకాటుకు చికిత్స తీసుకుంటుండగా గుండె సంబంధిత సమస్యతో మరణించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావటంతో.. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇస్తామని క్యూరేటర్ హామీ ఇచ్చారు.
ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి - ఎస్వీ జూపార్కు ఉద్యోగిని మృతి తాజా వార్తలు
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఎస్వీ జూ పార్కు పొరుగు సేవల మహిళా ఉద్యోగి మృతి చెందారు. రెండు రోజుల క్రితం జూ పార్కులో విధుల్లో ఉండగా విజయమ్మ(42) పాము కాటుకు గురైంది. అప్పటి నుంచి తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యతో ఆమె ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
![ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10754850-39-10754850-1614149004167.jpg)
ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి