ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడ్​ ఒకటి.. సెంటర్​ మరొకటి.. ఎస్వీ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం - తిరుపతిలో ఎస్వీ విశ్వవిద్యాలయం తాజా వార్తలు

ఎస్వీ విశ్వ విద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. హాల్‌టికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పరీక్షా కేంద్రాల చిరునామాల్లో పొరపాట్లు దొర్లాయి. ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ఇప్పటికే వాయిదా వేయగా.. నేటి నుంచి యథావిధిగా జరగాల్సిన పరీక్షల్లో సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. పీలేరులోని 2 కేంద్రాల్లో 399 మంది రాయాల్సి ఉండగా ఒక్కరూ రాని పరిస్థితి నెలకొంది.

sv-university

By

Published : Nov 16, 2019, 10:45 AM IST

Updated : Nov 16, 2019, 3:23 PM IST

ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్శిటీ పరిధిలోని 63 కేంద్రాల్లో 75,727 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఈ నెల 14,15వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. ఇవాళ్టి నుంచి యథావిధిగా పరీక్షలు జరగాల్సి ఉండగా.... హాల్ టికెట్లలో జరిగిన తప్పుల వల్ల విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరులో 2 పరీక్షా కేంద్రాల్లో 399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా... ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవటం... హాల్ టికెట్ల జారీలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

అసలేం జరిగింది..?

డిగ్రీ పరీక్షలకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముద్రించిన హాల్​టికెట్లలో పరీక్షా కేంద్రం కోడ్​ ఒకటి కాగా... సెంటర్ పేరు మరొకటిగా ముద్రించారు. కోడ్ తెలియని విద్యార్థులు పీలేరు ప్రభుత్వ ఎస్జీ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం పేరు మాత్రమే చూసుకొని అక్కడకు పరీక్ష రాసేందుకు వెళ్లారు. తీరా పరీక్షా సమయం ప్రారంభమైన కాసేపటికే.. అధికారులు ఈ కోడ్​ సీఎన్​ఆర్​ డిగ్రీ కళాశాలకు చెందినదిగా విద్యార్థులకు తెలిపారు. గందరగోళానికి గురైన 200 మంది విద్యార్థులకు ఏమి చేయాలో పాలుపోలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. చివరకు గంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.

ఎస్వీ రిజిస్ట్రార్​ విచారణ

కోడ్​ ఒకటి.. సెంటర్​ మరొకటి.. ఎస్వీ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

విషయం తెలుసుకున్న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్​ శ్రీధర్ రెడ్డి హుటాహుటిన పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్నారు. సంఘటనపై వివరాలను ఆరా తీశారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడంపై ప్రిన్సిపల్​ ఎస్​ఎస్​ఎండీ బాషాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే ఉదయం పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లి పోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘం నాయకులు అధికారులను నిలదీశారు. ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా వెళ్లిపోయారో తెలియలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

చేనేత అనుబంధ రంగాల కార్మికులకు తప్పని నిరాశ

Last Updated : Nov 16, 2019, 3:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details