చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాల పీజీ వైద్యురాలి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్యులను తిరిగి నియమించటాన్ని మృతురాలి భర్త రవికుమార్ రెడ్డి ఖండించారు.
బాధ్యులను విధుల్లోకి తీసుకోవడంపై వైద్యురాలి భర్త ఆందోళన - SV Medical College PG doctor suicide case news
ఎస్వీ వైద్యకళాశాల పీజీ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుల పునర్నియామకంపై ఆమె భర్త రవికుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![బాధ్యులను విధుల్లోకి తీసుకోవడంపై వైద్యురాలి భర్త ఆందోళన SV Medical College PG doctor suicide case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9119068-189-9119068-1602292064981.jpg)
రవికుమార్ రెడ్డి
తన భార్య ఆత్మహత్య చేసుకోవటంలో వైద్యులు కిరీటి, శశికుమార్ల పాత్ర గురించి శాఖాపరంగా మార్చి నెలలో నిర్వహించిన విచారణలో వెల్లడించానని రవికుమార్ తెలిపారు. పూర్తి ఆధారాలు ఉన్న బాధ్యులైన వారిని పునర్నియమించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారికి పోస్టింగ్ ఇవ్వటంపై ప్రభుత్వం పునరాలోచించాలని రవికుమార్ కోరారు.
ఇదీ చదవండి:డాక్టర్ కిరిటీ, డాక్టర్ శశి కుమార్ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు