ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suryapet DMHO: డీఎంహెచ్‌వో కుటుంబంలో కొవిడ్‌ కలకలం.. రెండ్రోజుల క్రితమే తిరుపతికి.. - corona virus

Suryapet DMHO
Suryapet DMHO

By

Published : Dec 2, 2021, 8:24 PM IST

Updated : Dec 2, 2021, 9:53 PM IST

20:20 December 02

5 రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్‌వో కుమారుడు

Covid positive: కరోనా కొత్త వేరియంట్​ భారత్​లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భయపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్​ పరీక్షలు సైతం నిర్వహించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో.. అన్ని జాగ్రత్తలు చెప్పే వైద్యాధికారి కుటుంబంలోనే కరోనా కేసులు నమోదైతే..? అందులోనూ.. ఓ కుటుంబసభ్యుడు ఇటీవలే విదేశం నుంచి వస్తే..? రెండ్రోజుల క్రితమే వాళ్లంతా సుప్రసిద్ధ దైవక్షేత్రానికి వెళ్లివస్తే..? నిన్నే.. ఆ వైద్యాధికారి ఓ కార్యక్రమంలో పాల్గొంటే..? ఇదంతా.. ఓ తుంటరి ఊహ కాదండీ.. తెలంగాణలోని సూర్యాపేటలో వెలుగు చూసిన ఈ తరహా ఘటన కలకలం రేపింది.

corona cases in DMHO Family: సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలం కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్​గా తేలింది. నిన్న కొవిడ్‌ పరీక్షలు చేసుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది. డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్​గా తేలింది. ఇవాళ కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్‌వో కోటాచలంకు కరోనా​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

corona positive to Suryapet DMHO: డీఎంహెచ్‌వో కుమారుడు 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. అదీకాక.. డీఎంహెచ్‌వో కుటుంబం రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి రావటమనేది ఇప్పుడు మరింత ఆందోళకు దారి తీస్తోంది. తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లోనే కొవిడ్‌ లక్షణాలు బయటపడటమే ఇందుకు కారణం. మరోవైపు డీఎంహెచ్​వో కోటాచలం.. నిన్న ఎయిడ్స్​డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకు కూడా ఈరోజు కరోనా పాజిటివ్​గా తేలటం వల్ల.. నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి

NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

Last Updated : Dec 2, 2021, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details