ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Supreme Court on TTD Issue : తితిదే 8 వారాల్లో సమాధానమివ్వాలి -సుప్రీం కోర్టు - చిత్తూరు జిల్లా వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కార్యక్రమాలు జరగుతున్నాయని సుప్రీంకోర్టులో ఓ భక్తుడు వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సీజేఐ ధర్మాసనం విచారణ ముగించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లో సమాధానమివ్వాలని తితిదేను ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. పరిపాలన విషయాలపై పిటిషనర్‌కు తితిదే సమాధానమివ్వాలని సూచించింది.

Supreme Court on TTD Issue
తితిదే 8 వారాల్లో సమాధానమివ్వాలి -సుప్రీం కోర్టు

By

Published : Nov 16, 2021, 1:07 PM IST

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కార్యక్రమాలు జరగుతున్నాయని సుప్రీంకోర్టులో ఓ భక్తుడు వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సీజేఐ ధర్మాసనం విచారణ ముగించింది. ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలు కోర్టులు చేపట్టవన్న ధర్మాసనం... కార్యకలాపాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులు చూసుకుంటారని తెలిపింది.

పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లో సమాధానమివ్వాలని తితిదేను ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం..పరిపాలన విషయాలపై పిటిషనర్‌కు తితిదే సమాధానమివ్వాలని సూచించింది.

పూజలు, కైంకర్యాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని తితిదే ధర్మాసనానికి తెలిపింది. లోటుపాట్లు లేకుండానే స్వామివారికి సేవలు జరుగుతున్నాయని వాదనలు వినిపించింది.

తితిదే వివరణలు విన్న ధర్మాసనం...లోటుపాట్లు లేవని తితిదే చెబుతోంది కదా...లోటుపాట్లు కనిపిస్తే ఆగమశాస్త్ర పండితుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషినర్ కు సూచించింది. ప్రచారం కోసమే పిటిషన్‌ దాఖలు చేసినట్లు అనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇదీ చదవండి : Tirumala : శ్రీవారికి వైభవంగా.. "కైశిక ద్వాదశి ఆస్థానం"

ABOUT THE AUTHOR

...view details