మతం మార్చుకున్న వ్యక్తిని తిరుపతి ఉప ఎన్నికలో ఎస్సీ అభ్యర్థిగా నిలబెట్టి ముఖ్యమంత్రి జగన్ దళిత జాతిని మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ మండిపడ్డారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ప్రశ్ననే భాజపా తరపున అడుగుతున్నామని.. వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మతంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల కోసం హిందూ మతాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. గోవింద నామాలను అవహేళన చేస్తూ మంత్రి పేర్ని నాని మాట్లాడినా.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నా.. సీఎం జగన్ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపాది డ్రామా అయితే జగన్ తిరుమలకు వచ్చినప్పుడు పెట్టుకున్న నామాల సంగతేంటని ప్రశ్నించారు.