ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP PGCET Web Option Problems : పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొత్త తీరు.. గందరగోళంలో విద్యార్థులు.. - ఏపీ పీజీ ప్రవేశ పరీక్ష రుసుము

AP PGCET Web Option Problems : గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలకు ఒకే పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించారు. దీంతో పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించిన వైఖరితో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు.

AP PGCET Web Option Problems
పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొత్త తీరు...గందరగోళంలో విద్యార్థులు..

By

Published : Jan 24, 2022, 12:33 PM IST

AP PGCET Web Option Problems : పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించిన వైఖరితో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సాంకేతిక సహాయంతో యోగివేమన విశ్వవిద్యాలయం ఏపీపీజీ సెట్‌ నిర్వహించింది. పదకొండు విశ్వవిద్యాలయాల పరిధిలోని దాదాపు వివిధ సబ్జెక్ట్‌లలో ఉన్న పదివేల సీట్లకు ముప్పై వేల మంది పోటీ పడ్డారు. గతంలో ఒక్కో సబ్జెక్ట్‌కు మాత్రమే ప్రవేశ పరీక్ష రుసుం వసూలు చేస్తుండగా ఈ ఏడాది జరిగిన పీజీ సెట్‌లో కోర్సుల వారీగా ప్రవేశ పరీక్ష రుసుం వసూలు చేశారని విద్యార్థులు వాపోతున్నారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులు, పీజీసెట్‌ నోటిఫికేషన్‌ సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్‌కు మాత్రమే ఫీజు చెల్లించి పరీక్షలు రాశారని తెలిపారు. గతంలో పరీక్షల అనంతరం విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా ఆయా సబ్జెక్ట్‌లలోని కోర్సులను ఎంపిక చేసుకొనేవారని....ప్రభుత్వ నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details