ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన - sri venkateswara university pg admissions news

తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీజీ కోర్సుల ప్రవేశాల్లో పలువురు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

sri venkateswara university
sri venkateswara university

By

Published : Mar 20, 2021, 4:31 PM IST

తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీజీ కోర్సుల ప్రవేశాల్లో వర్సిటీ అధికారులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ సంఘాల నాయకులు ఆరోపించారు. నకిలీ టీసీలతో.. పీజీ కోర్సుల్లో కొందరు ప్రవేశాలు పొందారన్నారు.

ఇందుకు అధికారులు సహకరించారని.. అవినీతికి పాల్పడ్డారని ఆందోళన చేశారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్​తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరినీ సస్పెండ్ చేయలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details