రాష్ట్ర పోలీస్ తొలి డ్యూటీ మీట్‌ను నాలుగు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా తెలిపారు. నగర పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 4 నుంచి 7 వరకు సాగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్రైం, సైబర్ ఇలా విభిన్న శాఖల నుంచి పోలీసుల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. వీటిని చూసేందుకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ఆసక్తి ఉన్న వారందరూ తరలిరావాలని కోరారు.
తిరుపతిలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర పోలీస్ తొలి డ్యూటీ మీట్ - చిత్తూరు సమాచారం
నాలుగు రోజుల పాటు సాగే రాష్ట్ర పోలీస్ తొలి డ్యూటీ మీట్‌ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా తెలిపారు. జనవరి 4 నుంచి 7 వరకు నిర్వహించే కార్యక్రమాలను తిలకించేందుకు ఆసక్తి ఉన్నవారందరూ.. తరలిరావాలని కోరారు
తిరుపతిలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర పోలీస్ తొలి డ్యూటీ మీట్